లావేరు: వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా లావేరు శాఖా గ్రంధాలయంలో మంగళవారం 52 మంది విద్యార్థులతో ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో లెమన్ స్పూన్, డస్టర్ ఆట, కోకో ఆట, మ్యూజికల్ చైర్స్, తదితర ఆటలను ఆడించారు. ఈ ఆటల్లో విజేతలకు గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. అలాగే యూకేజీ చదువుతున్న చిన్నారులు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు ఏ. గడ్డియ్య విద్యార్థులు పాల్గొన్నారు.