వేసవి కాలం చల్లగా ఉండటానికి మనం ఎక్కువగా శీతల పానీయాలకి ప్రాముఖ్యత చూపిస్తాం . అలానే కొంతమంది ఫ్రూట్ జ్యూస్లకు మక్కువ చూపిస్తారు కానీ శరీరం వేడిని తగ్గించడంతో పాటు , కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తొలిగించడానికి ఒక ఔషధం ఉంది . అది ఏంటో అనుకోకండి మనకు అందుబాటులో ఉండేదే ... అదేనండి చెరుకు రసం . చెరుకు రసం మన శరీరంలో చల్లదనాన్ని పెంచి వేడిని తగిస్తుంది .
రోజూ ఒక గ్లాసు చెరకు రసం తాగితే మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. అలానే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి . చెరుకు రసంలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. చెరుకు రసం బెల్లం , పంచదార మిశ్రమాల కలయిక కాబట్టి శరీరంలో పిత్తం , వాతం లాంటి సమస్యలను తొలిగించి మల విసర్జన సులభంగా అయ్యేలా చేస్తుంది అలానే కడుపులోని నులి పురుగులు లాంటివి లేకుండా ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తుంది .
అలానే చెరుకు రసం తీసుకొని , చల్లటి ప్రదేశంలో నిల్వ చేసుకొని ప్రతి రోజు , ఒక గ్లాస్ రసాన్ని తీసుకొని అందులో కొంచెం తేనే కలుపుకొని తాగడం వలన మీ శరీరం చాల ఆహ్లాదకరంగా ఉంటుంది అని నిపుణుల సలహా .