అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు ఎస్.ఐ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఎల్.సింగవరం రెవెన్యూ పరిధి పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడని స్థానికులు గుర్తించారని స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామని అన్నారు. అయితే సదరు వ్యక్తి గత రెండు రోజులుగా పొలాల్లో తిరుగుతున్నట్లు, మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిసిందన్నారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటాయని మృతుని ఆచూకి గుర్తించినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నందు భద్రపరిచినట్లు వెల్లడించారు.