నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి సోమ, మంగళవారాల్లో జరిగిన ఈడీ విచారణ సంతృప్తికరంగా లేదు. దీంతో బుధవారం కూడా మరోసారి విచారణకు రావాలని రాహుల్‌ను ఈడీ ఆదేశించింది. సోమవారం ఉదయం 10 గంటలకు, మంగళవారం ఉదయం 9 గంటలకు ఈడీ విచారణ జరిగింది. తాజాగా మళ్లీ సమన్లు జారీ చేయడంతో రాహుల్ వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.