వేటపాలెం మండలంలోని రావూరిపేట శివారులో కొలువైయున్న కనక నాగవరపమ్మ అమ్మవారి 37వ శిడి మహోత్సవం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామాల నుంచే కాకుండా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు.