రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు జనం స్వాగతం పలుకుతున్నారు. పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలంలోని అంబలపల్లెలో కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్‌రెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.