ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలలు కూడా వెరీ కాస్ట్లీ గురూ...పేకమేడలా కూలిన ఆమె కల

international |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 01:45 AM

తాను ధనవంతురాలు కావాలనో...ఇంకోటో ఎవరైనా ఉన్నతంగా ఆలోచిస్తారు. కానీ ఆమె మాత్రం ఓ వింత కలపెట్టుకొంది. దాని సాకారం చేసుకొనే క్రమంలో తన గొతిలో తానే పడింది. ఆమె పేరు క్రిస్టినా ఒజ్‌తుర్క్. ఆమెకు 22 మంది సర్రొగేట్ పిల్లలున్నారు. ఇంతమంది పిల్లలు ఎందుకు అని అనుకుందామంటే... ఆమె మొత్తం 105 మంది పిల్లలతో ఓ భారీ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని కలలు కంది అనే విషయం తెలిసింది. 105 మంది సంగతేమో గానీ... ఇప్పుడు 22 మంది పిల్లల్ని ఎలా పెంచాలన్నది ఆమెకు సమస్యగా మారింది. అధికారులు జరిపిన స్పెషల్ ఆపరేషన్‌లో ఆమె భర్త అరెస్ట్ అయ్యాడు. పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత ఆమెపై పడింది. తాను పెంచలేనని లబోదిబోమంటోంది.


"ఒంటరి అయ్యాను. భవిష్యత్తు ఏంటో తెలియదు. ఎటు చూసినా అంధకారం" అంటూ ఆవేదన చెందుతోంది క్రిస్టినా. ఆమె భర్త గాలిప్ ఒజ్‌తుర్క్ ఓ వ్యాపారవేత్త. కుదురుగా వ్యాపారం చేయకుండా... హవాలా  చేస్తూ... డబ్బును అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నాడు. ఆ కేసులోనే అరెస్ట్ అయ్యాడు.


క్రిస్టినా ఇదివరకు స్ట్రిప్పర్‌గా పనిచేసేది. పెళ్లి తర్వాత ఆ పని మానేసింది. భర్తకు బాగానే డబ్బు ఉండటంతో... 105 మంది పిల్లల్ని పెంచాలనుకుంది. గాలిప్‌కి ఇంటర్ సిటీ బస్ కంపెనీ మెట్రో టూరిజ్మ్ ఉంది. అందువల్ల తమకు డబ్బుకి లోటు ఉండదు అనుకుంది క్రిస్టినా. 1996లో కువ్వెట్ అనే వ్యక్తిని గాలిప్ హత్య చేసినట్లుగా... 2018లో కోర్టు తేల్చింది. అతనికి జీవిత ఖైదు విధించింది. ఐతే... గాలిప్ ఎలాగొలా... జార్జియా నుంచి టర్కీకి పారిపోయాడు. అక్కడ వ్యాపారం ప్రారంభించాడు.


గాలిప్ కోసం జార్జియా పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. మొత్తానికి అతను టర్కీలో ఉన్నట్లు కనిపెట్టారు. కానీ అరెస్టు చెయ్యలేకపోయారు. తాజాగా అతను జార్జియా రాగానే... అక్కడి రెండో అతి పెద్ద నగరమైన బాతుమీలో పోలీసు అదికారులు అలర్ట్ అయ్యి... భారీ రైడ్ చేసి... మే 31న అతన్ని అరెస్టు చేశారు. 57 ఏళ్ల గాలిప్ అరెస్ట్ అయిన తర్వాత.. జార్జియా ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. గాలిప్‌ని మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అక్రమాలు చెయ్యడానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడని తెలిపింది. ఇది రెండో కేసు. ఆల్రెడీ హత్య కేసు అలాగే ఉంది.


24 ఏళ్ల క్రిస్టినాకి టర్కీలో ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఇక భర్త తిరిగి టర్కీ వచ్చే ఛాన్స్ లేదు. ఆమె తన భర్తతో కలిసి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టేది. ఆమెకు ఇన్‌స్టాలో 2.24 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.


"నా చుట్టూ ఇంత మంది పిల్లలు ఉన్నా... ఒంటరి అయిపోయాననే బాధ నన్ను వీడట్లేదు. నా భర్త ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనీ, నాతోనే ఉండాలని అనుకునే 


ఈ జంట 2021లో రూ.1,38,00,000 ఖర్చుపెట్టి సర్రోగసీ విధానంలో ఒక్క సంవత్సరంలోనే 20 మంది పిల్లల్ని పొందారు. ఆ తర్వాత 2022లో మరో ఇద్దర్ని పొందారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వీళ్లు 16 మంది ఆయాలను నియమించారు. వారికి సంవత్సరానికి రూ.67,70,000 చెల్లిస్తున్నారు. ఈ ఆయాలు 24 గంటలూ, వారమంతా చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల అత్యవసరాల కోసం క్రిస్టినా వారానికి రూ.4,00,000 ఖర్చు పెడుతోంది. 20 భారీ నాప్పీ బ్యాగ్స్‌తోపాటూ... 53 ప్యాకెట్ల బేబీ ఫార్ములా కొంటోంది. ఇలా ఖర్చు తడిసి మోపెడవుతోంది. రష్యాకి చెందిన క్రిస్టినా... ఓసారి జార్జియా వెళ్లినప్పుడు గాలిప్‌ని కలిసింది. అప్పటికే ఆమెకు విక్టోరియా అనే ఆరేళ్ల కూతురు ఉంది. గాలిప్‌తో పెళ్లి తర్వాత 2020లో సర్రొగేట్ విధానంలో తొలి సంతానంగా ముస్తఫాని పొందింది. ఇప్పుడు 22 మంది పిల్లల్ని తాను ఎలా పెంచాలి అని క్రిస్టినా ఆవేదన చెందుతోంది. అంతా అల్లకల్లోలం అయిపోయింది అంటోంది. ఇలా భర్త చేసిన అక్రమాలతో ఆమె చిక్కుల్లో పడినట్లైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa