మృగశిర కార్తె చివరి అంకంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం కాసేపు వేడి వాతావరణం, కాసేపు మబ్బులతో కూడిన వాతావరణం చోటుచేసుకుంటుంది. నైరుతి రుతుపవనాల కారణంగా విజయవాడ నగరానికి సమీపంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇప్పుడు ఈ భారీ వర్షం తుపానుగా మారి మరో గంటలో ఏలూరు, కృష్ణా జిల్లా వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అంతేగాక, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa