ఆర్మీ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మార్చిన నేపథ్యంలో దేశమంతటా అభ్యర్థులు అల్లర్లు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని ప్రతిపక్షాలు సైతం వాపోతున్నాయి. ఈ క్రమంలోనే, ప్రభుత్వ ఆస్తులు ద్వాంసం కాకుండా పోలీస్ బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు పోలీసులు జిల్లాలోని రైల్వే స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, BSNL, తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భధ్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాలలోని ప్రధాన కూడళ్లు, తదితర ప్రాంతాలలో నిన్నటి నుండీ పటిష్ట నిఘా కొనసాగుతోంది.