‘చంద్రబాబు పనైపోయింది.. అందుకే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని అనిపిస్తోంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో నీఅంత పనికిమాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పదం చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ.... పనికిమాలిన పదానికి చంద్రబాబు పేటెంట్. వెన్నుపోటు, మ్యానిపులేషన్, ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చిందా..? దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని సంకలు నాకావో.. ఎంతమందికి ఊడిగం చేశావో.. అన్నీ పక్కనబెడితే.. నీకంటే పనికిమాలిన వారు ఎవరైనా ఉన్నారా..? దీపం ఆరిపోయేముందు ఎలాగైతే వెలుగు వస్తుందో.. అలాగ గట్టిగా అరుస్తున్నాడు. చంద్రబాబు మాట్లాడినదాంట్లో బాధ్యత గల మాటలు ఉన్నాయా..? రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుంటే.. అది బైజూసో, వైయస్ జగన్ జూసో అని వెటకారంగా మాట్లాడుతున్నాడు. అంటే నీ హెరిటేజ్ సంస్థలో అమ్ముకునే జ్యూస్ అనుకుంటున్నావా..? ప్రపంచంలో 150 మిలియన్‌ల విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని చదువుతున్నారు. నీకు తెలియకపోతే ఇంట్లో నీ మనవడిని అడుగు బైజూస్ గురించి చెప్తాడు. ఇంగ్లిష్ బోధన అంటే మమ్మీడాడీ కోసమా అని మాట్లాడుతున్నాడు.. నీ అబ్బాయిని మమ్మీడాడీ కోసమే ఇంగ్లిష్ మీడియంలో చదివించావా..? దేనికోసం చదివించావ్.. దేనికోసం విదేశాలకు పంపించావ్..? నీ కొడుకు, నీ మనవడు ఇంగ్లిష్ మీడియం చదువుకోవాలి.. విదేశాలకు వెళ్లాలి.. నీకు తోడుగా దోచుకుతినడమే నీ తత్వం. పేదపిల్లలు, ఆర్థికంగా అవకాశాలు లేనివారు, గ్రామీణప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు ఇంగ్లిష్ చదువులు వద్దా..? ఇంటర్నేషన్ సంస్థ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటే ఎగతాళి చేస్తావా..? నువ్వు మాట్లాడిన మాటల్లో ఒక్క మాటైనా రాష్ట్రం కోసం, ఒక ప్రాంతం కోసం మాట్లాడానని చెప్పు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు చేసుకుంటూ.. తిరిగి అందరినీ పనికిమాలినోళ్లు అంటున్నాడు. వయసు పెరిగితే కాదు, అనుభవం ఉంటే కాదు, మంచి సలహాలు, ఆలోచనలు ఉండాలి అని ఆగ్రహం వ్యక్తపరిచారు.