కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ను వ్యతిరేకిస్తూ బీహార్ , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నడికుడి రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులతో కలసి దాచేపల్లి పట్టణ సిఐ బిలాలుద్దీన్ గస్తీ నిర్వహించారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. యువత ఎటువంటి హింసాత్మక ఘటనకు పాల్పడవద్దని సీఐ సూచించారు.