నాయకుడు అంటే ప్రజల బాగోగులు చూసుకునే వాడు అని చంద్రబాబు మరోసారి నిరూపించారు అని అంటున్నారు టీడీపీ నాయకులూ. చీపురుపల్లి పర్యటన ముగించుకుని విశాఖపట్నం వెళ్తూ ఉండగా, పురేయవలస రోడ్డు పై బైక్ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా అదే సమయంలో అటుగా వెళ్తున్న చంద్రబాబు , ప్రమాద ఘటన వద్ద ఆగి, సొంత కాన్వాయ్ లో భాగమైన అంబులెన్స్ లో క్షతగాత్రులను ఎక్కించి,హాస్పిటల్ కు పంపించి,వారికి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక తెదేపా నాయకులను అదేశించారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తుంది.