గుంటూరు జిల్లాలో శనివారం ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగర పరిధిలోని నాలుగు కేసులు, తాడేపల్లి లో ఒకటి, తెనాలిలో రెండు కేసులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో క్రమేపీ కరోనా కేసులు పెరగడం వల్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు మాస్కులు ధరించడం తో పాటు వ్యక్తిగత రక్షణ పద్ధతులు పాటించాలని కోరుతున్నారు.