అగ్నిపథ్ పథకంను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దేశంకోసం సేవ చేసే ఎంతోమంది ఆర్మీ ప్రేమికుల నిరుద్యోగులను నిలువునా మోసం చేసి దేశ రక్షణ విషయంలో రాజీ పడటం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుంచి బాలాజీ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆఫీస్ బేరర్స్ రవి మాట్లాడుతూ దేశంలో దేశభక్తితో సేవ చేసే రక్షణ రంగంలో కాంట్రాక్టు ద్వారా పోస్టులు భర్తీ చేస్తామనడం దారుణమన్నారు.