తిరుచానూరు పద్మావతి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకి బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, గుండాల గోపినాథ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజివో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాదం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజివో మనోహర్, ఆలయ సూపరింటెండెంట్ మధుసూదన్, ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు, ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.