ఉత్తరాంధ్ర లో జగన్ రెడ్డి అండ్ కో చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకున్నందుకే బీసీ నాయకుడైన అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేశారు అని టీడీపీ నాయకులూ బుద్దా వెంకన్న వాపోయారు. అయ్యన్న పాత్రుడు ఇంటి కూల్చివేత విషయంపై స్పందించిన వెంకన్న మాట్లాడుతూ.... విశాఖ లో జరుగుతున్న వైసిపి భూదందాకి అడ్డుపడినందుకే అయ్యన్న గొంతు నోక్కాలని కుట్ర పన్నారు. అక్రమ మైనింగ్ బయటపెట్టి, గంజాయి మాఫియా గుట్టురట్టు చేసినందుకే అయ్యన్న ఇళ్లు కూల్చడానికి పూనుకున్నారు. ఆయన మాట్లాడిన భాషకే ఇళ్లు కూల్చి, అరెస్ట్ చెయ్యాలనుకుంటే వైసిపి నేతల మాట్లాడిన భాషకి ఎం శిక్ష వెయ్యాలి? అని ప్రశ్నించారు.