పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయం. జగన్ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. పంటల బీమా మంజూరు అస్తవ్యస్తంగా ఉంది.అర్హులైన రైతులకు పంటల బీమా మంజూరు కాకపోవడం విచారకరం.వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, జగన్ పోవాలి...చంద్రబాబు రావాలి....ప్రజలు గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను చీదరించుకుంటున్నారు అని తెలియజేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను నాయకులు,కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నాయకులకు సూచించడం జరిగింది.