పెరుగుతున్న రక్తపోటు వివిధ ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అయితే ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అరికట్టవచ్చునని, అలాగే గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా దోహదం చేస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అరోగ్య సమస్యల్లో హైబీపీ ఒకటి. మారుతున్న జీవన శైలి, ఆనారోగ్య అలవాట్ల కారణంగా రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో హైబీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బెర్రీలు, యాపిల్స్, బేరి, రెడ్ వైన్ వంటి ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే పండ్లు, పానీయాలతో సిస్టోలిక్ రక్తపోటు స్థాయి తగ్గించుకోవచ్చు. రక్తపోటును నియంత్రించే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.టీ
టీ లో పాలీఫెనోలిక్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టీని నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకోకుండా చూడాలి.
2.యాపిల్స్
యాపిల్ పండులో ఫ్లేవనాయిడ్స్ 3 విభిన్న సబ్ క్లాస్ లుగా ఉన్నాయి. ఫ్లేవొనోల్స్, ఫ్లేవోన్స్, ఫ్లేవనోల్స్. ఇవి సహజ పదార్ధాలతో సమృద్ధిగా ఉండి రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి.
3.ఆరెంజ్
100 గ్రా. నారింజలో దాదాపు 19.6 మి.గ్రా. ఫ్లేవనాయిడ్‌ల ఆగ్లైకోన్‌లు ఉంటాయి. ఒక రోజులో తాజాగా పిండిన ఆరెంజ్ తీసుకోవడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
4.స్ట్రాబెర్రీలు
బెర్రీలు కొన్ని రకాల ఫ్లేవనాయిడ్ లకు గొప్ప మూలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు తినడం ద్వారా ఆంథోసైనిన్, కాటెచిన్, క్వెర్సెటిన్, కెంఫ్‌ఫెరోల్ అనే ఫ్లేవనాయిడ్లు లభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా సహాయపడి రక్తపోటును నియంత్రిస్తాయి.
5.కాలే
ఈ ఆకుపచ్చ ఆకు కూర ఇతర కూరగాయల కంటే ఎక్కువ ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది. శరీరంపై ఆరోగ్యకరమైన ప్రభావాన్ని చూపుతుంది. దీనిని పలు వంటకాల్లో వేసుకుని తినడం వల్ల ఎన్నో ఫ్లేవనాయిడ్లు మన శరీరానికి అందుతాయి.
6.ఉల్లిపాయలు
ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్, ప్రధానంగా ఆంథోసైనిన్స్, క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనోల్స్‌లను ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహారానికి రుచిని ఇస్తాయి. అంతేకాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
7.రెడ్ క్యాబేజీ
సైనైడింగ్, ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్ ప్రధాన పోషకాలు ఎర్ర క్యాబేజీలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి యాంటీఆక్సిడెంట్లుగా సేవలందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటుతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకంగా ఆనందించే క్యాస్రోల్ వంటకం ఇది.