రేణిగుంట శ్రీకాళహస్తి రోడ్డు మార్గం లోని స్థానిక వెదుళ్లచెరువు వద్ద రేణిగుంటకు వస్తున్న లారీని లగేజీ తో వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో చోదకుడు రఫీ గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి 108 లో చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. ఈ సంఘటనతో కొంత సమయం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa