కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనబోయే భారత హాకీ జట్టును సోమవారం ఎంపిక చేశారు. గోల్‌కీపర్లుగా పీఆర్ శ్రీజేష్, క్రిషన్ బహదూర్ పాఠక్, డిఫెండర్లుగా వరుణ్ కుమార్, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్ (వైస్ కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, మిడ్‌ఫీల్డర్లుగా మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, నీలకంఠ శర్మ, ఫార్వార్డ్స్‌గా మన్‌దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్ ఎంపికయ్యారు.