టీమిండియా కీలక ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కరోనా సోకింది. దీంతో ఈ నెల 16న జట్టుతో పాటు ఇంగ్లాండ్ వెళ్లలేకపోయాడు. ప్రస్తుతం అశ్విన్ క్వారంటైన్‌లో ఉన్నట్లు బీసీసీఐ తాజాగా వెల్లడించింది. జులై 1న ఇంగ్లాండ్ జట్టుతో టెస్టుకు అతడు కోలుకుని జట్టులో చేరతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంగ్లాండ్‌తో గత టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది. భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది.