ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు సౌకర్యార్థం సురక్షితమైన ప్రదేశాలలో బస్సులను నిలిపివేయనున్నట్లు తెలిపింది. టీ, కాఫీ, భోజనం వంటివి తీసుకునేందుకు ప్రత్యేక ప్రదేశాలను గుర్తించాలని అధికారులను, రీజినల్ మేనేజర్లను ఎండీ తిరుమల రావు ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ బస్సులను ఆపడానికి వీల్లేదని అన్నారు.