ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయంలో హుండీలను గురువారం లెక్కించారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి ఈ నెల 23వ తేదీ వరకు మూడు నెలల కాలానికి రూ. 15, 37, 552 ఆదాయం సమకూరినట్టు ఈవో కేఎన్పీడీవీ ప్రసాద్ చెప్పారు. లెక్కింపు కార్యక్రమాన్ని రామచంద్రపురం దేవాలయాల తనిఖీ అధికారి ఆర్. రామలింగేశ్వరరావు, చింతలూరు ఆలయ ఈవో ఎ. ఎస్. బి. జి. రామలింగం పర్యవేక్షించారు. గంగా పురుషోత్తం, చక్రధరరావు, శ్యామ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.