బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 47 మందికి గాయాలైన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇండోర్ - ఖాంద్వా రోడ్డులో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించగా క్షతగాత్రులకు రూ.50 వేల పరిహాన్ని ప్రకటించారు.