బజాజ్ ఫైనాన్స్ ఆగడాలు. చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. కాల్ వస్తే బెంబేలేత్తున్న జనాలు. సంబంధం లేని వ్యక్తులకు బజాజ్ ఫైనాన్స్ కాల్ సెంటర్ వేధింపులు.ఫైనాన్స్ లో వస్తువు, రుణం తీసుకున్న వారికి సంబంధం లేని వ్యక్తులకు ఫోన్లు చేసి ఫలానా వ్యక్తి బజాజ్ ఫైనాన్స్ వద్ద ఫైనాన్స్ తీసుకున్నారు... బకాయిలు చెల్లించలేదు. మీరు హామీ ఉన్నారు.. అంటూ వారితో మాట్లాడించండి అంటూ హాకుం.. మాకు సంబంధం లేదు అంటే .... పచ్చి బూతులు తిడుతూ, అసభ్యంగా, అవమానకరంగా, హీనంగా కించపరుస్తూ మాట్లాడుతున్న వైనం.ఫోన్లు చేసి మాట్లాడే వారి మాటలకు మానసిక క్షోభకు గురి అవుతున్న జనం.మానసిక వేధనతో నరక యాతన అనుభవిస్తున్న బాధితులు . మంగళగిరి రూరల్ స్టేషన్ ను అశ్రయించిన 7గురు బాధితులు. రూరల్ ఎస్ ఐ విజయకుమార్ రెడ్డికి బాధితుల ఫిర్యాదు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్