వైసీపీ కార్యకర్తల చేతిలో దారుణ హత్యకి గురైన జల్లయ్య కుటుంబాన్ని గురువారం పల్నాడు జిల్లా రావులాపురంలో పరామర్శించి, రూ. 25 లక్షల సాయాన్ని అందజేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జల్లయ్య ముగ్గురు పిల్లల్ని చదివిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ... కుతంత్రాలతో నా పల్నాడు పర్యటనని పోలీసులు అడ్డుకోవాలనుకున్నారు. అడుగడుగునా వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి వెనక్కితగ్గారు. పిడుగురాళ్ల పట్టణంలో యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా నేతలు, కార్యకర్తలు నాపై కురిపించిన అభిమానం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అని ఆనందాన్ని వ్యక్తపరిచారు.