ఈ ఏడాది ఆగష్టు 7వ తేదీలోపున భూ - సర్వే సంబంధించి అన్ని రకాల ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యంను విజయవంతంగా పూర్తి చేస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా , రాష్ట్ర డైయిరి డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబుకి తెలిపారు. అమరావతి నుండి ఏ.పి . డైరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ అహ్మద్ బాబు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న శాశ్వత హక్కు సురక్ష రీ సర్వే పురోగతి పై సమీక్షించారు. అమరావతి నుండి ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ , జిల్లా కలెక్టర్లు , జాయింట్ కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియోకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాలగార్లు సంబంధిత అధికారులతో కలిసి ఈ వీడియోకాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు .