అనంతపురం జిల్లా, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS శుక్రవారం తనిఖీ చేశారు. ఉమెన్ హెల్ప్ డెస్క్, రికార్డుల నిర్వహణ, పోలీసుస్టేషన్, పరిసరాలను పరిశీలించారు. పోలీసు స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం... కొన్ని కేసులను సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండకూడదు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలన్నారు. నేరాలు మరియు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. దిశ యాప్ పై విస్తృతంగా అవగాహన చేసి రిజిస్ట్రేషన్లు చేయించాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఇటుకలపల్లి సి.ఐ మురళీధర్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ తదితరులు వెళ్లారు.