వైసీపీ దుర్మార్గులు చెప్పారని ఈ మూడేళ్లలో ఎవరైతే టీడీపీ మీద దాడులు చేశారో, వారేవరిని వదిలిపెట్టె ప్రసక్తి లేదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెమ్ నాయుడు మీడియా ముఖంగా తెలియజేసారు. అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ తొలగింపు విషయంపై అయన స్పందిస్తూ... ఐపీఎస్ మణికంఠను సూటిగా ప్రశ్నిస్తున్నా. నీకు రాజ్యాంగం తెలుసా? సూర్యాస్తమయం తరువాత కట్టడాలు కులగొట్టకూడదని సుప్రీం ఆ దేశాలు ఉన్నాయి. వాటిని అమలు చేసే బాధ్యత నీకు లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు శాశ్వితం కాదు అని , కానీ ప్రభుత్వ ఉద్యోగులు శాశ్వితం అని గుర్తుపెట్టుకోవలనన్నారు. రాజ్యాంగ బద్ధంగా , ప్రజా క్షేమం కోసం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు పని చెయ్యాలి తప్ప, ప్రభుత్వాలకి కొమ్ముకాయడం నీచమైన చర్య అని ఆయన తెలియజేసారు.