ఆర్థిక ఇబ్బందుల వల్ల దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు హైకోర్టుకు నివేదిక అందించిన వైసీపీ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అత్తార్ జాహీద్ హుస్సేన్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి వస్తే దులహన్ పథకానికి ఇస్తున్న రూ. 50 వేలను రూ. లక్ష పెంచి ఇస్తామని నమ్మించి ముస్లిం సోదరులను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బనగానపల్లె పట్టణ ఉపసర్పంచ్ బుర్రానుద్దీన్, పట్టణ అధ్యక్షుడు ఖాసీం బాబు, పూల కలామ్, అల్తాఫ్ హుస్సేన్, షబ్బీర్, బాబు, ఖైరత్ అలీ తదితరులు పాల్గొన్నారు.