విదేశీయులకు ఆశ్రయం కల్పించిన వారు, విదేశీయుల వివరాలను ఆన్లైన్ ద్వారా FORM - C నందు తప్పనిసరిగా 24 గంటలలోపు నమోదు చేసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ తెలియజేసారు. విదేశీయులు జిల్లాలోని ఏదైనా లాడ్జీలు,అతిధి గృహాలు,ఆసుపత్రులు,హోటళ్లు,రిసార్టులు, విద్యాసంస్థలు,వ్యక్తిగత ఇళ్ళు,ఫ్లాట్లు,ఆపార్టుమెంట్లు,సత్రాలు,అద్దె ఇళ్ళు,ఇంకా ఏదేని ఇతరత్రా ప్రాంగణములో ఆశ్రయం పొందిన యెడల,వారికి అట్టి ఆశ్రయం కల్పించిన వారు విదేశీయుల చట్టం - 1946 (Foreigners act - 1946) ప్రకారం ఆన్లైన్లో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ పోర్టల్ (https://boi.gov.in/content/form-c) నందు form - c వివరాలను దాఖలు చేయవలెను,ఆ విధంగా ఎవరైనా వివరాలను పొందుపరచనిచో అట్టి వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన హెచ్చరించారు.