రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక, ఇక్కడ ఉన్న అవకాశాలను ప్రపంచ స్థాయిలో ఫోకస్ చేసి, యువతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలి అని సీఎం జగన్ పూనుకున్నారు అని మంత్రి అమర్నాధ్ తెలియజేసారు. అందుకు ఏ విధంగా ఇక్కడ పెట్టుబడులు ఎలా ఆకర్షించాలి అన్న దానిపై ప్రభుత్వం ఎంతో దృష్టి పెట్టింది. కోవిడ్ వల్ల దాదాపు రెండేళ్లు నష్టం జరిగింది. అయినా సీఎంగారు ఎక్కడా, ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. సంక్షేమ రంగంలో రాష్ట్రాన్ని పరుగెత్తించారు. రెండేళ్లలోనే హామీల్లో 95 శాతం నెరవేర్చారు. లక్ష కోట్లకు పైగా సంక్షేమ పథకాల కింద ఇవ్వడం అనేది దేశంలోనే ఒక రికార్డు అందులో భాగంగా తిరుపతి జిల్లాలో సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీల ప్రారంభం. మరి కొన్నింటికి భూమి పూజ చేయడం జరిగింది. ఇనగలూరులో హిల్ టాప్ ఎస్‌ఈజెడ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (అపాచీ)కు భూమి పూజ చేయడం జరిగింది. దాదాపు 298 ఎకరాల్లో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీ. రూ.800 కోట్ల పెట్టుబడి. ఆ 10 వేల మందిలో దాదాపు 80 «శాతం స్థానిక మహిళలకు అవకాశాలు రానున్నాయి. రేణిగుంట సమీపంలోనే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో టీసీఎల్ కంపెనీ దాదాపు రూ.1230 కోట్ల పెట్టుబడి. 2200కు పైగా ఉద్యోగ అవకాశాలు. ఫాక్స్‌లింక్స్ కంపెనీ రూ.1000 కోట్ల పెట్టుబడి. ఇక్కడ కూడా 2200 మందికి ఉద్యోగ అవకాశాలు. సన్నీ ఒపోటెక్. దాదాపు 1200 మందికి ఉద్యోగావకాశాలు. వీటన్నింటినీ సీఎంగారు ప్రారంభించారు.వీటన్నింటితో పాటు, డిక్సన్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి శంకుస్థాపన, స్మార్ట్ టీవీ సంస్థతో ఓంఓయూ. టెక్‌బౌల్స్ సంస్థ. దాదాపు 800 మందికి ఉద్యోగావకాశాలు. ఒంగోలులో రూ.800 కోట్ల పెట్టుబడి. దాన్ని వర్చువల్‌గా ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడి. 20 వేల మందికి ఉద్యోగవకాశాలు అని తెలియజేసారు.