గ్రామ స్థాయిలో ఇంటింటికీ ఆరోగ్య సేవలను అందించడమే సీఎం జగన్ లక్ష్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇందుకోసం 10,032 వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి, ప్రతి క్లినిక్‌లో ఒక ఏఎన్ఎం, ఒక ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా వర్కర్లు ను నియమించారన్నారు. సీఎం జగన్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న సుపరిపాలనను ప్రపంచ నలుమూలల్లో చాటిచెబుదామని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలోని శాన్ అంటోనియో, టెక్సాస్ లో జరుగుతున్న అమెరికన్ అసోసియేషన్ ఫర్ ఫిజిషియన్స్ అఫ్ ఇండియన్ ఆరిజన్ (AAPI) మహాసభలలో వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వైద్య రంగంలో చేపట్టిన, చేపట్టబోతున్న అభివృద్ది గురించి ప్రసంగించారు.