ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మేము నిర్వహిస్తున్న జాబ్ మేళాను విమర్శిస్తున్నారు అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు. ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంచుమించు 60 ప్రభుత్వ రంగ సంస్థలును మూసేశారు. ఉద్యోగాలు ఇచ్చేది కాకుండా.. తీసేసిన ప్రభుత్వం చంద్రబాబుది. అదే ఈ మూడేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వలంటీర్ వ్యవస్థలో మొత్తం 4లక్షల 50వేల ఉద్యోగాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారు. ఇవి కాకుండా వైద్యరంగంలో 30వేలు ఉద్యోగాలు కల్పించారు. రాబోయే కాలంలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఇంచుమించు 5లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది అని తెలియజేసారు. అలానే దానికి విరుద్ధంగా చంద్రబాబు తన 14ఏళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, ఉద్యోగాలను కల్పించడంపోయి, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనత దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. తన హయాంలో ఒక్క జాబ్ మేళా అయినా నిర్వహించాడా అని తనను తాను ప్రశ్నించుకుంటే మా ప్రభుత్వాన్ని విమర్శించడు. ఉద్యోగాలు కల్పిస్తున్న వైయస్సార్ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదు. అందుకే చంద్రబాబును అభినవ పులకేశిగా అభివర్ణించాలి. అలాంటి వ్యక్తిని నమ్మవద్దని సూచిస్తున్నాం. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి, విద్యార్థిని, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ జాబ్ మేళా ప్రక్రియ కొనసాగుతుంది అని హామీ ఇచ్చారు.