మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలిపేందుకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో యువతకు పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)G.బిందు మాధవ్ ఐపీఎస్ అవగాహన కల్పించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా నరసరావుపేట SEB శాఖ వారు యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలిపేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సమావేశానికి అతిథిగా పాల్గొన్న అదనపు ఎస్పీ . చదువుకోవలసిన సమయంలో ఈమత్తుకు అలవాటు పడి,క్రమేపీ దానికి బానిసలై కొంతమంది యువత తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.కొంత మంది ఆ మత్తులో నేరాలకు కూడా పాల్పడి, జైలు జీవితాలను అనుభవిస్తున్నారు.ఇది చాలా విచారకరమని అదనపు ఎస్పీ తెలిపారు.