మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే 'కోతులాట'ను తలపిస్తోందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కోతుల్లా ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. "ఈ సంక్షోభంపై మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏం చేస్తుందో చేయనివ్వండి. మేమైతే మహారాష్ట్ర పరిణామాలపై ఓ కన్నేసి ఉంచాం" అని ఒవైసీ వివరించారు. ఇది శివసేన పార్టీ అంతర్గత వ్యవహారమని, తాను కానీ, తన పార్టీ కానీ ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.