నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరంలో జనసేన పార్టీ ఇంచార్జి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పావనన్న ప్రజా బాట కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలని తెలుసుకొని వాటి పరిష్కారానికి సాయం చేస్తున్నారు. ఎండైనా, వానైనా కానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, సీఎం అయ్యేవరకు అలానే ఇతను ఎమ్మెల్యే అయ్యేవరకు ప్రజల్లోనే ఉంటాను అని తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "జగన్ రెడ్డి గారు 5లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు ఇచ్చింది ఒకటిన్నర లక్ష కోట్లే మిగిలిన మూడున్నర లక్షల కోట్లు ఏమయ్యాయని పవన్ కళ్యాణ్ అడిగితే వైసీపీ వాళ్ళు అంతెత్తున లేస్తున్నారు " అలోచించి ఈ సారైనా ఓటు వెయ్యండి అని తెలియజేసారు.