వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కట్టినవాటి కన్నా , కూల్చినవే ఎక్కువ అని టీడీపీ ఆరోపించింది. ఈ సందర్భంగా కొన్ని వివరాలను సోషల్ మీడియా ద్వారా చూపిస్తూ ... ప్రజా వేదిక, రుషికొండ, మూడు లాంతర్ల కట్టడం, గుంటూరులో అమ్మవారి ఆలయం, సబ్బం హరి ఇల్లు, అయ్యన్న ఇల్లు, పల్లా శ్రీనివాస్ ఇల్లు, విశాఖలో Fusion Foods ,గంటా అనుచరుడుగా ఉన్న కాశీ విశ్వనాథకు చెందిన గో కార్టింగ్ , గీతం యూనివర్సిటీ, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంజనేయస్వామి గుడి , వైజాగ్ లోని APTDC resort , Vizag MVP కాలనీలో హెడెన్ స్పౌట్స్ స్వచ్ఛంద సంస్థ షెడ్డు, ప్రకాశం బ్యారేజి సమీపంలో ఉన్న విజయేశ్వర స్వామి గుడి, మంగళగిరిలో ఇళ్ళ కూల్చివేత , ఎన్టీఆర్ విగ్రహం కూల్చి వేత , ఆంధ్రజ్యోతి విశాఖలో పత్రికా ముద్రణకేంద్రం కూల్చివేత, డొక్కా సీతమ్మ నిత్య అన్నదాన శిబిరం కూల్చివేత అని ఒక లిస్ట్ తాయారు చేసి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేసారు. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో ఇంకా ప్రజలకే తెలియాలి.