పుట్టగొడుగుల్లో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి ఉంటాయి. వీటిని తింటే గుండె సంబంధిత సమస్యలు పోతాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను పోగొడతాయి. పుట్టగొడుగుల్లోని కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. పుట్టగొడుగుల్లో శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.