ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నమెంట్‌లో భారత మహిళల రికర్వ్ జట్టు రజతం తో సరిపెట్టుకుంది. ఆదివారం నాడు జరిగిన ఫైనల్ పోరులో ఫైనల్లో దీపికా కుమారి, అంకితా భకత్, సిమ్రన్‌జీత్ కౌర్‌తో కూడిన భారత త్రయం 1-5తో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ చెన్-యింగ్‌తో కూడిన చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకుంది. ఈసారి ఈ మెగా టోర్నీలో భారత్ కు ఓ స్వర్ణం, రెండు రజతాలతో మొత్తం మూడు పతకాలు దక్కాయి. వీటిలో రెండు పతకాలు తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సాధించినవే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa