గడిచిన మూడేళ్ల పాలనలో విద్యరంగం కోసం రూ.52 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మూడో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, సుమారు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,500 కోట్లు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా మరికొద్ది క్షణాల్లో జమకానున్నాయన్నారు. పిల్లల చదువుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో అమ్మఒడి మూడో విడత కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. మాటిచ్చాం.. మళ్లీ ఎన్నికలప్పుడు చూసుకుంటాం.. పసుపు, కుంకుమ, బెల్లం, కారం ఇచ్చి సరిపెట్టుకుంటామంటే సరిపోదు.. అదికాదు రాజకీయం. మాటిస్తే నెరవేర్చే విధంగా రాజకీయ నాయకుడు ఉండాలని, రాజకీయాలకు సీఎం వైయస్ జగన్ కొత్త ఒరవడి తీసుకువచ్చారు అని తెలియజేసారు.