పల్నాడు ప్రాంతంలోని రాజకీయ నాయకులూ అంటే ఎంతో మంది గొప్ప వారు గుర్తుకు రావడం మాములే. ఎందుకంటే రాష్ట్రానికి సీఎం గ పని చేసిన కాసు బ్రహ్మనందరెడ్డి కూడా పల్నాడు ప్రాతం వారే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన కంటూ ఒక ముద్ర , స్తానం ఏర్పాటు చేసుకున్న నాయకులూ కోడెల శివ ప్రసాద్ రావు. ఎన్నో పదవులు చేసి, రాజకీయ చాణిక్యుడిలా టీడీపీ లో కీలక పాత్ర పోషించారు. కానీ అతని మరణం ఈ ప్రాంత ప్రజలకి తీరని లోటు గ చెప్పుకోవచ్చు. ఐతే, ఆయన అభిమానులు మాత్రం ఊరూరా విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ తరుణంలో సత్తెనపల్లి నియోజకవర్గం, కొమెరపూడి గ్రామానికి కోడెల విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ నిమిత్తం అక్కడికి వెళ్తున్న టీడీపీ నాయకులూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కార్ పై వైసిపి వర్గియులు రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలియజేసారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని హెచ్చరిస్తూ, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పుల్లారావు కోరారు.