ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా మళ్లీ దాడులకు తెగబడింది. యుద్ధం తొలినాళ్లలో కీవ్‌ను ఆక్రమణకు ప్రయత్నించి వెనక్కి తగ్గిన రష్యా తాజాగా దూకుడు పెంచింది. పుతిన్ సైన్యం 14 క్షిపణులను కీవ్ నగరంపై ఆదివారం ప్రయోగించింది. ఈ దాడుల్లో భాగంగా రెండు నివాస భవనాలు కూలిపోగా, నలుగురు గాయపడ్డారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఏడేళ్ళ చిన్నారిని స్తానీకులు రక్షించారు. 22 రోజుల తర్వాత మొదటి రష్యా క్షిపణుల దాడి ఇదే..!