శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఈ రోజు సీఎం జగన్ అమ్మవడి మూడో విడత సొమ్ము విడుదల చేసారు. దీనిపై స్పందించిన టీడీపీ నాయకులూ మాట్లాడుతూ... అమ్మ ఒడి + వసతి దీవెన + విద్యాదీవెన పథకాల ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి లక్షా 50 వేల రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం, అమ్మ ఒడి రూ.13,000 + ఫీజు రీయంబర్స్‌మెంట్ రూ.35,000 + , వసతి దీవెన రూ.20,000తో, రూ.68 వేలు మాత్రమే ఇస్తున్నారు. మిగతా, రూ.82 వేలు ఎప్పుడు ఇస్తున్నారు ? అని టీడీపీ నాయకులూ కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.