రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ నేపథ్యంలో ఇ– క్రాపింగ్, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరి కిరణ్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.