ఆ రోజు అతని పుట్టిన రోజు. కానీ అదే అతనికి చివరి రోజు అవుతుందని ఊహించలేదు. పార్టీ కోసం చపాతీలు ఆర్డర్ ఇచ్చిన అతను అనంతరం జరిగిన గొడవతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
సన్నీ అను వ్యక్తి తన బర్త్ డే పార్టీ కోసం 150 చపాతీలు ఆర్డర్ ఇస్తే హోటల్ సిబ్బంది 40 చపాతీలు మాత్రమే ఇచ్చారు. తక్కువ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడంతో హోటల్ సిబ్బంది అతడిని కొట్టి చంపారు. ఈ ఘటన ఆదివారం ఉత్తర్ప్రదేశ్లో జరిగింది.