నరసరావుపేట పట్టణ పరిధిలోని అరండల్ పేట కు చెందిన జి. వెంకటేశ్వర్లు(20) నర్సరావుపేట- సాతులూరు రైల్వే స్టేషన్ మధ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సందర్శించి ఆరా తీశారు. తల్లి మందలిoచడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తుల్లో తేలిందని ఎస్సై. ప్రకాష్ తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.