వెలుగోడు పట్టణంలోని గ్రామ సచివాలయం-2లో బుధవారం ఆధార్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీడీవో షేక్ అమానుల్లా తెలిపారు.
5 నుండి 15 సం. ల మధ్య వయస్సు గల విద్యార్థినీ, విద్యార్థులకు ప్రాథమికంగా ఆధార్ సేవలు గ్రామ సచివాలయాల్లో అందిస్తారని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని తెలిపారు. బయోమెట్రిక్ ఆప్డేడేట్ కు రూ. 100 రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. పిల్లలకు కొత్త ఆధార్ కార్డు నమోదు ఉచితంగా చేస్తామన్నారు.