నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాలు మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు నంద్యాల ట్రాఫిక్ సిఐ తెలిపారు. బుదవారం వారు మాట్లాడుతూ రోడ్లకు అడ్డంగా తోపుడు బండ్లు ఉంచరాదన్నారు.
ఓవర్ లోడ్ వాహనాలు ఉదయం ఎనిమిది లోపే టౌన్ లోకి రావాలన్నారు. బైర్మల్ స్ట్రీట్ లో వన్ వే అమలు చేశామన్నారు. నంద్యాల పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు రోడ్లపై వాహనాలు అడ్డంగా పార్కింగ్ చేయరాదన్నారు.