వైయస్ జగన్ తీసుకున్న సచివాలయ వ్యవస్థ నిర్ణయం సంచలనంగా మారింది. అయితే సచివాలయాలపై నిరంతర నిఘా లేకపోతే, ఇతర ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా వీరు కూడా లెదర్జిక్ గా మారడం, అవినీతికి అలవాటు పడడం వంటి ప్రమాదాలు ఉన్నాయి.అలా జరగకుండా ఒక పర్యవేక్షణ ఉండడం కోసం ప్రభుత్వం ఎమ్మెల్యేలను ఈ సచివాలయాలకు వారానికి రెండు రోజులు వెళ్లి రావాలని ఆదేశించింది. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ వ్యవస్థలో జీతాలు పెంచడానికి అవసరం అయ్యే వ్యయాన్ని భరించడం కష్టం అవుతుందా? లేక ఇబ్బంది ఉండదా అన్నది తేలడానికి మరి కొంత సమయ పడుతుంది. ఆర్దికంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి ప్రభుత్వం ఆదాయ వనరులను కూడా పెంచుకోవల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.